నిత్య జీవితంలో భాగమైన సెల్ఫోన్లో వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మాట్లాడితే హైబీపీ సమస్య 12 శాతం ఎక్కువగా ఉంటుందని తాజా పరిశోధనలో గుర్తించారు. 6 గంటలకుపైగా మాట్లాడితే 25 శాతం సమస్య ఉంటుందని తేల్చారు. మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు, తీవ్ర తలనొప్పి, చెవి సమస్యలూ వస్తాయట. ఫోన్ల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీనే దీనికి కారణమని చెప్పారు.