కేంద్రంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తాజాగా ప్రకటించింది. దాంతో ఈ నెల 28, 29, 30 తేదీలలో బ్యాంకుల బంద్ యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించింది. ఉద్యోగులు బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. కాగా, వారానికి 5 రోజుల పనిదినాలు కల్పించాలని, ఇతర డిమాండ్లను పరిష్కరించాలని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.