ఇరాన్‌తో చర్చలు ఆశాజనకంగా ఉన్నాయని అమెరికా రాయబారి పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు ఆశాజనకంగా ఉన్నాయని, దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం అమెరికా ఆశిస్తున్నట్లు పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఇరాన్‌తో మాట్లాడుతున్నామని, నేరుగానే కాకుండా మధ్యవర్తుల ద్వారా కూడా చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. కాగా, ఇరాన్, ఇజ్రాయిల్‌ల మధ్య కాల్పుల విరమణ బుధవారం నుండి కొనసాగుతోంది.