తమిళ నటుడు అభినయ్ (44) కన్నుమూశారు. 2002లో ధనుష్ హీరోగా వచ్చిన తుల్లువథో ఇళమై చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న అభినయ్ ఇటీవల ఆర్థిక సహాయం కోరగా, ధనుష్ రూ.5లక్షలు, కేపీవై బాల రూ.1లక్ష సహాయం చేశారు. ఆయన మరణం సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగా, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో 15కిపైగా చిత్రాల్లో నటించారు. తుపాకీ సినిమాలో విద్యుత్ జామ్వాల్ పాత్రకు డబ్బింగ్ ఇచ్చారు.