100 కోట్ల మంది కస్టమర్లే లక్ష్యం: సునీల్ మిట్టల్

భారతీ ఎయిర్‌టెల్ సంస్థ గ్లోబల్ కస్టమర్ల సంఖ్యను 100 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 60 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉన్న సంస్థ, మరో 40 కోట్లను చేరుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. భారతీ గ్రూప్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఛైర్మన్ సునీల్ మిట్టల్ ఈ విషయాన్ని వెల్లడించారు. టెలికాం రంగంతో పాటు ఆర్థిక సేవలు, సావరిన్ క్లౌడ్, ఏఐ డేటా కేంద్రాల్లోకి సంస్థ విస్తరించనుంది. నెట్‌వర్క్, టవర్లు, ఫైబర్ అభివృద్ధి కోసం ఏటా రూ.30 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ఆయన వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕