మోదీ నా ఫ్రెండ్, ఇండియా మాకు మిత్ర దేశం అంటూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. భారత్‌పై 25 శాతం సుంకాలు, జరిమానాలు విధించారు. ఈ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే పాకిస్థాన్‌తో ట్రేడ్ డీల్‌ను ప్రకటించారు. పెద్ద ఎత్తున చమురు నిల్వల అభివృద్ధి ఒప్పందం కుదిరిందని, భాగస్వామ్య చమురు కంపెనీ ఎంపిక జరుగుతోందని తెలిపారు. భారత్‌కు పాక్ చమురు విక్రయించే రోజు వస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.