లైంగిక దాడి కేసులో ‘తెహల్కా’ మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్పాల్ గోవా కోర్టులో లొంగిపోయారు. అనంతరం ఆయనను ఉత్తర గోవాలోని సెంట్రల్ జైలుకు తరలించారు. 2013లో గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో జూనియర్ మహిళా ఉద్యోగినిపై హోటల్ ఎలివేటర్లో లైంగిక దాడికి పాల్పడ్డారన్న కేసులో బాంబే హైకోర్టు తేజ్పాల్కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే లొంగుబాటు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించి, లొంగిపోవాలని ఆదేశించింది.