జూలై 1 నుంచి టాటా మోటార్స్ కార్ల ధరల పెంపు

దేశంలోనే రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్ తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జూలై 1 నుంచి ఈ ధరల పెంపు అమలులోకి రానుంది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలతో సహా అన్ని మోడళ్ల ధరలు గరిష్టంగా 1.5 శాతం వరకు పెరగనున్నాయి. కార్ల తయారీకి అయ్యే ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

సంబంధిత పోస్ట్