దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన మూడు వరుసల సఫారీ కారు ధరను రూ.25 వేలు పెంచింది. ఈ సంవత్సరంలో ధరల పెంపు ఇది మూడవసారి. పెరిగిన ధరల తర్వాత టాటా సఫారీ రూ.13.40 లక్షల నుండి రూ.26.91 లక్షల మధ్య అందుబాటులో ఉంది. ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు, త్వరలో ఈవీ రూపంలోనూ విడుదల కానుంది. సఫారీలో 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, పనోరమిక్ సన్‌రూఫ్, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ఏడీఏఎస్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.