టాటూ వేయించుకునేవారు పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త, సీల్ చేసిన సూది వాడకం, ఆర్టిస్ట్ డిస్పోజబుల్ గ్లౌజులు ధరించడం, పరికరాలను శుభ్రపరచడం, సింగిల్-యూజ్ ఇంక్ క్యాప్‌లు వాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. టాటూ వేసిన తర్వాత కూడా ఆఫ్టర్‌కేర్ సూచనలు పాటించాలి. పరిశుభ్రత, భద్రత విషయంలో రాజీ పడకుండా స్టూడియోను ఎంచుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.