ముంబైలో అమెరికా నుంచి వచ్చిన ఓ యువతిని టాక్సీ డ్రైవర్ 400 మీటర్ల ప్రయాణానికి రూ.18వేలు వసూలు చేశాడు. ఈ ఘటనపై యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. పోలీసుల దృష్టికి వెళ్లడంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, సుమోటోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విచారణలో, డ్రైవర్ యువతిని అంధేరీ ఈస్ట్ ప్రాంతంలో 20 నిమిషాలు తిప్పి, పక్కనే ఉన్న హోటల్ వద్ద వదిలేసినట్లు ఒప్పుకున్నాడు.