అమెరికా ప్రభుత్వం PERM (పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్) ప్రోగ్రామ్‌పై చేసిన ప్రకటనను గమనించినట్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తెలిపింది. అమెరికా కార్మిక శాఖ ఆదేశాలను పాటిస్తామని, గత రెండేళ్లలో తమ PERM దరఖాస్తులు సింగిల్ డిజిట్‌లోనే ఉన్నందున ఈ ప్రోగ్రామ్ నిలిపివేత తమ ఉద్యోగ నియామక వ్యూహంపై ప్రభావం చూపదని పేర్కొంది. అమెరికాలో స్థానిక ప్రతిభావంతుల నియామకానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు, వచ్చే ఐదేళ్లలో మరో 15,000 మందిని నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు TCS వెల్లడించింది.