వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు.. మాజీ మంత్రి రోజాకు షాక్ తప్పదా?

AP: వైసీపీలో గత కొద్ది రోజులుగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీకి కీలక నేతలు రాజీనామా చేస్తుంటే.. ఇతర పార్టీల నుంచి కొందరు నేతలు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ సమక్షంలో రేపు నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జగదీష్ చేరికతో నగరి మాజీ ఎమ్మేల్యే, మాజీ మంత్రి రోజాకు షాక్ తగలనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన చేరికతో నగరిలో రోజా ప్రాధాన్యం తగ్గుతుందని చెప్పుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్