హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉత్కంఠగా సాగిన మున్సిపల్ పాలకవర్గ ఎన్నికకు తెరపడింది. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ, వైసీపీ గట్టి ప్రయత్నాలు చేశాయి. చివరికి హిందూపురం మున్సిపల్‌ ఛైర్మన్‌గా రమేశ్‌ కుమార్ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి రమేశ్ 23 ఓట్లు సాధించగా.. వైసీపీ అభ్యర్థి లక్ష్మి 14 ఓట్లు సాధించారు. అలాగే నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా తహసీన్ ఎన్నికయ్యారు. 29 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

సంబంధిత పోస్ట్