AP: కడప జిల్లాలోని పులివెందుల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 40 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీత తన సమీప వైసీపీ ప్రత్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై 13,875 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. మున్సిపాలిటీలో టీడీపీ 34, బీజేపీ 2, జనసేన 1 స్థానాలు గెలుచుకోగా, వైసీపీ 3 వార్డులకే పరిమితమైంది. దీంతో పులివెందుల మున్సిపల్ చైర్మన్ పీఠం కూటమి ఖాతాలో చేరింది. ఫలితాల అనంతరం టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.