ప్రతి ఏడాది అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా మానసిక ఒత్తిడి, డిప్రెషన్ తగ్గించడంలో టీ పాత్రపై నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని WHO తెలిపింది. బ్లాక్ టీ, గ్రీన్ టీలు డిప్రెషన్, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయని, వీటిలోని యాంటీఆక్సిడెంట్లు మెదడును రిలాక్స్ చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, పాలు, చక్కెరతో కూడిన టీ అధికంగా తాగడం జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరించారు.