టీచర్‌ను బయటకు పిలిపించి.. కత్తితో పొడిచి దారుణ హత్య

హర్యానాలో ఫరీదాబాద్ జిల్లా సిక్రోనా ప్రాంతంలోని జులై 29న ఒక ప్రైవేట్ పాఠశాల వద్ద, మాస్క్ ధరించిన వ్యక్తి ఉపాధ్యాయురాలు సంధ్యపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఆమెను బయటకు పిలిపించి, అక్కడికక్కడే కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. ఈ ఘటన పాఠశాల ప్రాంగణంలోని సీసీటీవీలో రికార్డయింది. బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. స్థానికుల ఆరోపణల మేరకు, పోలీసులు పూర్వ విద్యార్థి అమిత్‌ను అరెస్ట్ చేశారు. ఆ టీచర్‌ను అతను వేధిస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్