పాఠాలు చెప్పకుండా ఓ టీచర్ తరగతి గదిలో నిద్రపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నూజ్ జిల్లాలో చోటుచేసుకుంది. సిక్రోరిలోని ఓ స్కూల్‌లో టీచర్ డ్యూటీ టైంలో పాఠాలు చెప్పకుండా బెంచ్‌పై నిద్రపోయాడు. ఓ వైపు టీచర్ నిద్రపోతుంటే.. మరోవైపు విద్యార్థులు ఫోన్లు వాడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. సదరు టీచర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.