ఒక రూంలో పరీక్ష రాసిన వారందరికీ టీచర్ ఉద్యోగాలు!

AP: DSC-1994లో జరిగిన అక్రమాలను స.హ చట్టం ద్వారా మోహన్‌కృష్ణ అనే కార్యకర్త వెలుగులోకి తెచ్చారు. 1994 డీఎస్సీలో అనంతపురం జిల్లాకు చెందిన అభ్యర్థులు ఒకే గదిలో పరీక్షలు రాసారు. 12100974- 981 వరకూ హాల్‌టికెట్లు ఉన్నవారందరికీ టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. కాపీయింగ్‌ జరగడం వల్లే ఇలా అందరూ ఉద్యోగాలకు ఎంపికయ్యారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోరాడేందుకు నాడు పరీక్ష రాసిన అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.

సంబంధిత పోస్ట్