మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రీవా జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఒక చిన్న పిల్లాడితో విసనకర్రతో గాలి విసిరిస్తూ, చెవుల్లో ఇయర్‌ఫోన్లు పెట్టుకుని ఫోన్‌లో ముచ్చట్లలో మునిగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యా వ్యవస్థ పేరుతో జరుగుతున్న ఈ దారుణంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.