పెళ్లి చేసుకుంటానని నమ్మించి టీచర్‌పై అత్యాచారం!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక బ్యాంక్ ఉద్యోగి తనపై అత్యాచారం చేశాడని మహిళా టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన లక్నోలోని చిన్హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  ఆశిష్ కుమార్‌ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకుని, పెళ్లి ప్రతిపాదన చేశాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆమెతో సహజీవనం చేశాడు. అయితే ఆశిష్ ఇటీవల ఆమెను దూరం పెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్