AP: కాకినాడ జిల్లా, ఏలేశ్వరం బాలికోన్నత పాఠశాలలో టెన్త్ చదువుతున్న బాలికను ఓ ఉపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వేధింపులు ఎక్కువ కావడంతో బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీని ఆశ్రయించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని జై భీమ్రావ్ భారత్ పార్టీ నేత దాడిశెట్టి వీరబాబు డిమాండ్ చేశారు.