సిక్కింలో అదృశ్యమైన టీచర్ బెంగాల్‌లో అస్థిపంజరంలా కనిపించింది!

సిక్కింలో అదృశ్యమైన ఉపాధ్యాయురాలి అస్థిపంజర అవశేషాలు పశ్చిమ బెంగాల్‌లో లభ్యమవడం కలకలం రేపుతోంది. సిక్కింలో నామ్చి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో నేపాలీ బోధించే పస్సాంగ్ దోమా షెర్పా అనే ఉపాధ్యాయురాలు ఏడు నెలల క్రితం అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగుడిలో ఓ ఇంట్లో అస్థిపంజరం గుర్తించారు. అవి ఆ టీచర్‌వేనని అధికారులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్