ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ 2026–27 దేశవాళీ సీజన్ కోసం తమ జట్లను ప్రకటించింది. సీనియర్ రంజీ జట్టు కెప్టెన్‌గా ఆయుష్ బదోని ఎంపిక కాగా, అండర్-19 జట్టు సారథ్య బాధ్యతలను వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్‌కు అప్పగించారు. రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్ అక్టోబర్ 11న బెంగాల్‌తో, అండర్-19 జట్టు వినూ మన్కడ్ ట్రోఫీ తొలి మ్యాచ్ అక్టోబర్ 8న గుజరాత్‌తో తలపడనుంది. యువ ఆటగాడు యశధుల్ ఆయుష్ బదోనికి డిప్యూటీగా, అనుజ్ రావత్‌కు ప్రత్యామ్నాయంగా ప్రణవ్ రాజవంశీ ఎంపికయ్యారు. ఆర్యవీర్ సెహ్వాగ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.