గుజరాత్‌ మంత్రివర్గంలో టీమిండియా క్రికెటర్‌ భార్యకు చోటు

గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం 26 సభ్యులతో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా కూడా మంత్రిగా ప్రమాణ స్వీకరించారు. రివాబా జడేజా 1990లో రాజ్‌కోట్‌లో జన్మించి, మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 2019లో భాజపాలో చేరి 2022లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్