జపాన్‌లో బుల్లెట్ ట్రైన్ ఎక్కిన టీమిండియా ఆటగాళ్లు.. వీడియో వైరల్

ఆసియా క్రీడలు 2026లో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకునేందుకు సిద్ధమైన భారత పురుషుల క్రికెట్ జట్టు, శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో టోక్యో నుంచి నగోయాకు 'నోజోమి షింకాన్‌సెన్' బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించింది. ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 28, సోమవారం నిషిన్‌లో జరిగే కీలక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. 2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో పసిడి గెలిచిన టీమిండియా ఈసారి కూడా టైటిల్ నిలబెట్టుకోవాలని భావిస్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕