భారత పురుషుల క్రికెట్ జట్టు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్రను లిఖించింది. 200 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లల్లో విజయం సాధించిన మొదటి జట్టుగా నిలిచిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించింది. మొత్తం 300 మ్యాచ్‌లు ఆడిన టీమ్ ఇండియా 200 విజయాలను నమోదు చేసుకోగా, 83 మ్యాచ్‌లలో పరాజయం పాలైంది. 7 మ్యాచ్‌లు టైగా ముగియగా, 10 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. 176 విజయాలతో పాక్ రెండో స్థానంలో ఉంది.