టీమిండియా ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ షురూ.. నెట్స్‌‌‌‌‌‌‌‌లో కోహ్లీ, రోహిత్‌‌‌‌‌‌‌‌ మెరుపులు

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టింది. పెర్త్‌‌‌‌‌‌‌‌లో  స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ, రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ తొలి నెట్‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారు. గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో రన్నింగ్‌‌‌‌‌‌‌‌తో పాటు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్ చేశారు. చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ తర్వాత ఈ జోడీ తొలిసారి టీమిండియా తరఫున బరిలోకి దిగుతుండటంతో అందరి దృష్టి వాళ్లపైనే నెలకొంది. ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ తర్వాత రోహిత్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ గౌతమ్‌‌‌‌‌‌‌‌ గంభీర్‌‌‌‌‌‌‌‌తో, కోహ్లీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ మోర్నీ మోర్కెల్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్