2026 టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను కాపాడుకోవడమే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా ప్రధాన లక్ష్యం. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో గెలిచిన టీమిండియా ఈసారి స్వదేశంలో టోర్నమెంట్ ఆడనుంది. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. జట్టులో అభిషేక్ శర్మ, రింకు సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ తొలిసారి ప్రపంచ కప్‌లో ఆడనున్నారు. మిగతా ఆటగాళ్లకు ప్రపంచ కప్ అనుభవం ఉంది. అభిషేక్ ఓపెనింగ్, సుందర్ ఆల్-రౌండ్ ప్రదర్శన, తిలక్ మిడిల్ ఆర్డర్, రింకు ఫినిషర్ పాత్ర పోషించనున్నారు. హర్షిత్ రాణా ఎక్స్-ఫాక్టర్‌గా మారే అవకాశం ఉంది.