భారత్ - ఆస్ట్రేలియా మధ్య క్వీన్స్‌ల్యాండ్‌లోని కరారా ఓవల్ మైదానంలో గురువారం 4వ టీ20 జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లలో ఒకటి రద్దవగా, ఇరు జట్లు చెరొకటి గెలిచాయి. ఈ కీలకమైన మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. మధ్యాహ్నం 1:45 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే గత మూడు రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.