అమెరికాలో 13 ఏళ్లు విలాసవంతమైన జీవితం గడిపి, హెచ్1బీ వీసా గడువు ముగియడంతో ఓ ఐటీ నిపుణుడు భారత్‌కు తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ఇక్కడి వాతావరణం, మౌలిక వసతులకు అలవాటు పడలేక తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నానని 'రెడిట్'లో ఆవేదన వ్యక్తం చేశాడు. కరెంట్ కోతలు, వేసవి ఎండలు, దోమల బెడద, అస్తవ్యస్తమైన ట్రాఫిక్, అధ్వాన్నమైన గాలి నాణ్యత వంటి సమస్యలతో జీవితం నరకప్రాయంగా మారిందని, కల్తీ ఆహారం, నాణ్యత లేని వస్తువులతో బతకడం కష్టమని పేర్కొన్నాడు. పశ్చిమ దేశాలలో శాశ్వత పౌరసత్వం పొందేందుకు ఐటీ నిపుణులకు ఉన్న ఇతర వీసా మార్గాలు, వ్యూహాలు ఏమిటని నెటిజన్లను సహాయం కోరాడు.