తమిళనాడు తిరుచిరాలపల్లి విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (IXO 61) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. మధ్యాహ్నం 1.55 గంటలకు బయలుదేరిన విమానం, దాదాపు రెండు గంటల పాటు గాల్లోనే ఎగిరి, మధ్యాహ్నం 3.53 గంటలకు తిరుచ్చి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో 160 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల బంధువులు ఆందోళనకు గురయ్యారు.