బెంగళూరు నుంచి విజయవాడకు బయలుదేరాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్‌కు సిద్ధమైన అనంతరం విమానం తిరిగి ఎయిర్‌పోర్టు బేకు చేరుకుంది. ఈ విమానంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. విజయవాడలో జరగనున్న కేబినెట్ భేటీకి హాజరయ్యేందుకు మంత్రి ప్రయాణిస్తున్నారు. విమానం ఎప్పుడు బయలుదేరుతుందనే విషయంపై సిబ్బంది సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.