ఆర్మీ హెలికాప్టర్‌లో సాంకేతికలోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

M-17 ఆర్మీ హెలికాప్టర్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ముందు జాగ్రత్తగా పంజాబ్‌ పఠాన్‌కోట్‌లోని హాలెడ్ గ్రామ సమీపంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి  సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా నిన్న ఎయిరిండియా విమాన ప్రమాదంలో 265 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్