ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌లో సాంకేతిక సమస్య.. బ్రిటన్ ఎయిర్ బేస్ మూసివేత (వీడియో)

బ్రిటన్‌లో నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్‌ (NATS) సాంకేతిక సమస్యతో ఎయిర్ బేస్ మూసివేయడం కలకలం రేపింది. ఈ తాత్కాలిక గ్లిచ్‌తో బ్రిటన్ నుంచి బయలుదేరే అన్ని విమానాలు నిలిచిపోయాయి. లండన్‌లోని ఆరు ప్రధాన విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే తక్కువ సమయంలోనే ఇంజనీర్లు సమస్యను పరిష్కరించి, సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించామని ఎన్ఏటీఎస్ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్