MLC తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి నేపథ్యంలో ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి. మల్లన్న ఫిర్యాదు మేరకు జాగృతి కార్యకర్తలపై కేసు నమోదయింది. 'మాకేమైనా కంచం సంబంధం ఉందా? మంచం సంబంధం ఉందా?' అంటూ MLC కల్వకుంట్ల కవితపై వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల టౌన్ PSలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ ఆధ్వర్యంలో మహిళా నాయకులు ఫిర్యాదు చేశారు. మల్లన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.