తెలంగాణ అభివృద్ధి స్ట్రాటజీలో భాగంగా రాష్ట్రాన్ని CORE, PURE, RARE రీజియన్లుగా విభజించి సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని రంగాలను అభివృద్ధి చేసేలా తమ విజన్ ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ 2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ ఎకనామీగా మారుస్తామని ఆయన తెలిపారు.