తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తామని ప్రకటించడంతో పొత్తులపై చర్చ మొదలైంది. అయితే జనసేనతో పొత్తు అవసరం లేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధిస్తుందని చెప్పారు. పొత్తులపై నిర్ణయం జాతీయ స్థాయిలోనే ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టడం చర్చనీయాంశమైంది.