TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం గురువారం భేటీ కానుంది. ఈ సమావేశంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరగనుట్లు సమచాారం. దీంతో పాటు రేషన్ కార్డుల పంపిణీ, బనకచర్ల ప్రాజెక్టు వివాదం, రాజీవ్ యువవికాసం పథకం అమలుపై కూడా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటివరకు 18 సార్లు మంత్రివర్గ సమావేశాలు జరగ్గా 327 అంశాలపై చర్చించారు.