రేవంత్‌కు బూతులు తప్ప ఇంకేం రావు: హరీశ్ రావు

సీఎం రేవంత్ రెడ్డిపై BRS MLA, మాజీ మంత్రి హరీశ్ రావు, తీవ్ర విమర్శలు గుప్పించారు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ త్యాగాలు, ఆమరణ దీక్ష వల్లే వచ్చిందని, కేసీఆర్ ముమ్మాటికీ జాతిపిత అని, రేవంత్ రెడ్డి బూతుపిత అని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఒక్కసారైనా 'జై తెలంగాణ' అన్నాడా అని ప్రశ్నించిన హరీశ్ రావు.. హార్వర్డ్ పోయినా, అంతరిక్షం పోయినా కుక్క తోక వంకరగానే ఉంటుందని, రేవంత్‌కు బూతులు తప్ప ఇంకేమీ రావని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్