TG: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అప్రమత్తమైంది. ఇందిరా భవన్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బీఎల్‌ఏలు, ఎస్‌ఎస్‌ఏలతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఓటర్ల తొలగింపు ప్రక్రియపై కాంగ్రెస్ దృష్టి సారించిందన్నారు. బీజేపీ తెలంగాణను లక్ష్యంగా ఎంచుకుందని ఆరోపించారు. ప్రతి వారం మంత్రులు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్ల జాబితా, పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాల అమలును పరిశీలిస్తారని తెలిపారు.