కేంద్ర 'బడ్జెట్'లో తెలంగాణకు ప్రాధాన్యం: కిషన్ రెడ్డి

TG: కేంద్ర బడ్జెట్లో ఎరువులకు రాయితీ పెరిగిందని, దీనివల్ల రాష్ట్ర రైతులు లబ్ధి పొందుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 'కాకతీయ టెక్స్ టైల్స్ పార్కుకు మేలు చేసే పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. మెట్రో విస్తరణపై DPR ఇస్తే పట్టణాభివృద్ధి శాఖ నిధులు ఇస్తుంది. రాష్ట్రానికి 33 బాలికల హాస్టళ్లు, 3 హైస్పీడ్ రైళ్లు రానున్నాయి. డేటా సెంటర్లకు ఇచ్చే ప్రోత్సాహంతో తెలంగాణకు లాభం ఉంటుంది' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్