తెలంగాణలో సన్నబియ్యం ధరలను నియంత్రిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశాల మేరకు ఇటీవల మిల్లర్లు, వ్యాపారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో గరిష్ట ధరలను ఖరారు చేశారు. తాజా నిర్ణయం ప్రకారం, బీపీటీ, కేఎన్ఎం రకం కిలో రూ.66, తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ రకం రూ.74, హెచ్ఎంటీ, జేఎస్ఆర్ రకాల ధరను కిలో రూ.79గా నిర్ణయించారు. ఈ ధరల పట్టికను ప్రతి దుకాణంలోనూ తప్పనిసరిగా ప్రదర్శించాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.