TG: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ నేతలు అప్పుల తెలంగాణగా మార్చారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దీనికి బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చర్చకు రాకుండా సీఎం రేవంత్‌ను దూషించడమేంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.