నటుడు అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనిపై అల్లు అర్జున్ తరపు లాయర్లు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. కోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో అల్లు అర్జున్‌కు ఊరట దక్కినట్లయింది.