తెలంగాణలో ప్రస్తుత రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లను జూన్ మొదటి వారం నాటికి పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 64 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించినట్లు, 9.31 లక్షల మంది రైతులకు రూ. 11,500 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. అకాల వర్షాల వల్ల తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, దళారులను నమ్మవద్దని రైతులకు భరోసా ఇచ్చారు.