రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో వ్యవసాయ రంగం కీలకమని, దేశానికే ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం 3 లక్షల ఎకరాల్లో సాగవుతున్న పామాయిల్ సాగును 10 లక్షల ఎకరాలకు విస్తరిస్తామని, దీనివల్ల ఆదాయం, పర్యావరణం మెరుగుపడుతుందని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఎండీ రాకేశ్ స్వామితో జరిగిన భేటీలో ఈ విషయాలు వెల్లడించారు.