TG: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెరుగుతున్న చమురు ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలపై భారం పడకుండా రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించుకోవాలని సూచించారు. పెట్రోల్, డీజిల్‌పై దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం వ్యాట్ విధిస్తోందన్నారు. ఏపీలో 31 శాతం, MHలో 26 శాతం, KAలో 29 శాతంగా ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో మాత్రం 35.20 శాతం ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు.