TG: సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ HYDలోని సింగరేణి భవన్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, జాగృతి శ్రేణులతో కలిసి ముట్టడించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే సింగరేణి భవన్ ఎదుట బైఠాయించిన కవిత తోపాటు పలువురు జాగృతి శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.