అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి

తెలంగాణలోని హనుమకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన రాజేష్ (32) అమెరికాలో గుండెపోటుతో చనిపోయారు. ఉన్నత చదువుల కోసం 9 ఏళ్ల క్రితం వెళ్లిన రాజేష్ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నారు. మూడు రోజుల క్రితం రాజేష్ చనిపోగా, కుటుంబ సభ్యులకు ఆయన స్నేహితులు సమాచారం అందించారు. రాజేష్ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్